అలోచనలు: సృజనాత్మకంగ కలిగిన యువత కార్యక్రమాలకు పూనుకుంది.
ప్రారంభం: జె.ఎన్.టి.యు.లో ఫొటోగ్రఫీ చేసిన అగస్టస్, గాయకురాలైన జిలియన్ లీనా, కవి జాన్ హైడ్ కనుమూరి, స్టీవెన్ జయానంద్ ఇంకా కొందరు కలిసి జరిగించిన చిన్న కార్యం అప్పుడే మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
కవితోత్సవం: పేరుతో ఇప్పటికి కొందరు యువతకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మొదటి కార్యక్రమానికి ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ అద్దేపల్లి చేతులమీదుగా ప్రోత్సాహ బహుమతులను అందజేసింది.
రెండవసారి ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డి చేతులమీదుగా ప్రోత్సాహబహుమతులు అందజేయబడ్డాయి. ఫొటోస్కేఫ్స్: ఏటేటా ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతను ప్రోత్సహించడం, ఎగ్జిబిషన్లను పెట్టడం.
బొమ్మలబడి: ద్వార హ్రుద్ర్రోగులు, ఎయిడ్సు వంటి ధీర్గకాలిక రొగులైన పిల్లలను గుర్తించి చిత్రలేఖనం, ఫొటొగ్రఫి, వ్యర్ధపధార్దాలనుండి కళాకృతులు వెలికితీయడం నేర్పించి సహాయాన్నందించి ఆనందం, సంతోషం బొమ్మలతో మనసికోల్లాసం కలిగించి వారి అయుష్ను పెంచడం జరుగుతుంది.
స్పూర్తి : అందజేసి విద్యార్దులల్లో వుండే సృజనాత్మకత వెలికితీయడానికి కార్యక్రమాలు, పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు కౌన్సలింగు కార్యక్రమాలు.
సేవాకార్యక్రమాలు : పేదవిద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
చేయూత: కార్యక్రమాల వివరాలు తెలుసుకొని మీరు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు, ఆర్థిక సహాయాన్ని చెయ్యవచ్చు.
యువత స్ఫూర్తి పరీక్షలకు సిద్దపడుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం స్థలము :నందిగామ గ్రామము, పటాన్ చెరు మండలం, మెదక్ జిల్లా. తే :26.1.2008, శనివారముఉదయం 9 గంటలనుండి పాల్గొనవచ్చు, ప్రోత్సహించవచ్చు
1 comments:
అందరికీ హృదయపూర్వక అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి
Post a Comment