Thursday, November 15, 2007

 

కళాసౌందర్య విలువలు గల చిత్రం - చర్చించండి


నా బాల్యంలో ఇలాగె చేసెవారము. మా ఇల్లు పొలాల్లో వుండేది. దగ్గరలో చెరువు వుండేది. వర్షం ఎక్కువ వచ్చినా, చెరువు పొంగినా మాప్రాంతమంతా బోదెలలోకి నీరు వచ్చేది. దూరందూరంగ వుండె పది ఇల్లల్లో పిల్లలము చేపలు పట్టేవారం.నెనైతే స్కూల్ కూడ మనివేసెవాడిని.

Labels:


Comments:
చెరువులు చేపలు
క్రతువులు ఋతువులు
మట్టిలో జీవం
పొగలా అల్లుకొనే మంచు
లేత కిరణానికి
వంగుతున్న కిరణపు రంగులు
వర్షా కాలమో
శరత్ కాలమో

ఎగిరే చేపపిల్ల చురుకు
వడిసి పట్టుకోవడం
బాల్యమైనా జీవితానికి సన్నని జ్ఞాపకాలు

తీరం తెలియని దారుల్లో
వెతికేది పిల్లచేపో పెద్దచెపో
కూర కొస్తుందో రాదో
అయినా కవ్వించే జ్ఞాపకాలకోసం
కాలమంత నిరీక్షణ

చేతిగేలమో విసురు గేలమేసినా
పిత్తపరిగల చీర వలలో
రొయ్యవలలో
ఏదీ దొరకనివేళ మిగిలిన కవ్వింత గాలి సవ్వడి
జ్ఞాపకం కావలంటే అనుభవం కావలసిందే!

అద్భుత కాల సమ్మేళనాల గిలిగింత
జ్ఞాపకమోక పులకింత
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]